మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Venkatesha Karavalamba Stotram in Telugu – శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్


శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష |
లీలాకటాక్షపరిరక్షితసర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 1 ||

బ్రహ్మాదివందితపదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శనసుశోభితదివ్యహస్త |
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 2 ||

వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చితపాదపద్మ |
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 3 ||

లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాదిదోషపరిహారిత బోధదాయిన్ |
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 4 ||

తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష |
మచ్ఛిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 5 ||

శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికాతిలకశోభిలలాటదేశ |
రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 6 ||

వందారులోక వరదాన వచోవిలాస
రత్నాఢ్యహారపరిశోభితకంబుకంఠ |
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 7 ||

దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణసుశోభితదీర్ఘబాహో |
నాగేంద్రకంకణకరద్వయ కామదాయిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 8 ||

స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే |
లక్ష్మీం చ దేహి మమ ధర్మసమృద్ధిహేతుం
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 9 ||

దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృతతనో తరుణార్కదీప్తే |
సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 10 ||

రత్నాఢ్యదామసునిబద్ధ కటిప్రదేశ
మాణిక్యదర్పణ సుసన్నిభ జానుదేశ |
జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 11 ||

లోకైకపావనసరిత్పరిశోభితాంఘ్రే
త్వత్పాదదర్శన దినేశ మహాప్రసాదాత్ |
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 12 ||

కామాదివైరి నివహోఽచ్యుత మే ప్రయాతః
దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో |
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ || 13 ||

శ్రీవేంకటేశ పదపంకజషట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యామ్ |
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః || 14 ||

ఇతి శ్రీ శృంగేరి జగద్గురుణా శ్రీ నృసింహ భారతి స్వామినా రచితం శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.